Share News

Gurbaz: రో-కో రిటైర్‌ అయితే ఎంతో సంతోషిస్తా: అఫ్గానిస్తాన్ క్రికెటర్

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:06 PM

భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.

Gurbaz: రో-కో రిటైర్‌ అయితే ఎంతో సంతోషిస్తా: అఫ్గానిస్తాన్ క్రికెటర్
Ro-Ko

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచ కప్ 2027లో పాల్గొనడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz).. రో-కో వరల్డ్ కప్ ఆటడంపై మాట్లాడాడు.


‘ఒక అఫ్గానిస్తాన్ ఆటగాడిగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులో లేకుంటేనే నేను సంతోషిస్తా. వన్డేలకు కూడా వాళ్లు రిటైర్ అవ్వాలి. వారు టీమిండియాలో ఉంటే.. ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కుగా ఉంటాయి. వారిద్దరూ లెజెండ్స్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో లేరు అని ఎవరూ చెప్పలేరు. నిజానికి వారు జట్టులో లేకుంటేనే ప్రత్యర్థి జట్లు చాలా సంతోషపడతాయి’ అని గుర్బాజ్ అన్నాడు.


విరాట్ సాయం చేశాడు..

‘నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విరాట్(Vira Kohli) భాయ్‌ను సాయం అడిగేవాడిని. గత మూడేళ్లుగా ఎప్పుడు కాల్ చేసినా, మెసేజ్ చేసినా అతడు వెంటనే స్పందిస్తున్నాడు. ఇటీవలే నేను పరుగులు సాధించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడిని సంప్రదించా. ఆ తర్వాతి మ్యాచ్‌లో నేను 90 పరుగులు స్కోర్ చేశా. కోహ్లీ చాలా సింపుల్ వ్యక్తి. అతడు దేన్నీ క్లిష్టంగా మార్చడు. విరాట్ హార్డ్ వర్క్‌తో పాటు చేసే పనిని ఆస్వాదిస్తాడు. క్రికెట్‌లో అదే అవసరం’ అని గుర్బాజ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!

అరుదైన మైలురాయికి చేరువలో హిట్‌మ్యాన్!

Updated Date - Dec 03 , 2025 | 12:06 PM