• Home » Revanth Reddy

Revanth Reddy

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

రాష్ట్రంలోని ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి.. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు చెప్పారు.

గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు: సీఎం రేవంత్ ఆదేశం..

గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు: సీఎం రేవంత్ ఆదేశం..

భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ డెవల‌ప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి: సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి

హైదరాబాద్ డెవల‌ప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి: సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

కమీషన్లు నాకెందుకు!?

కమీషన్లు నాకెందుకు!?

‘‘నేను కమీషన్లు తీసుకుంటున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ అవసరం నాకేంటి!? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కేవలం 17.5 ఏళ్లలోనే జడ్పీటీసీ నుంచి సీఎం దాకా అన్ని పదవులూ వచ్చాయి. కోట్ల మందిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఇచ్చాడు. విద్య, వ్యాపారం.. పెళ్లి, పిల్లలను ఇచ్చాడు. ఇంకా నాకు కక్కుర్తి ఎందుకు ఉంటుంది?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

శాసన సభ సజావుగా జరగకుండా బీఆర్ఎస్ ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులను దూషించడం ద్వారా మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. చర్చించిన అంశాలివే..

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. చర్చించిన అంశాలివే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రేవంత్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజం మొత్తం చూసింది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

రేవంత్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజం మొత్తం చూసింది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేస్తే.. హుజూరాబాద్‌లో తాను రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. అనంతరం జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు.

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేరుతో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది.

రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు

రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. మూడు రోజులపాటు దేశ రాజధానిలో మకాం వేసి.. రాష్ట్రంలో తాను చేపట్టదలచిన మార్పులపై అధిష్ఠానాన్ని ఒప్పించారు.

ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరు: సీఎం రేవంత్‌

ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో చంచల్‌గూడ-సంతోష్‌నగర్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అభివృద్ధిపై పలు కీలక ప్రకటనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి