Home » Republic day
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కార్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు సీపీ సజ్జనార్. దేశ భద్రత కోసం వేలాది మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారన్న ఆయన.. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
భారత 77వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంలోని ప్రతీ పదం వెనుక ప్రజల భవిష్యత్తు దాగుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
77వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ప్రజలనుద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్.. హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో జరిగిన వేడుకల్లో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్తవ్యపథ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈరోజు భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర ఘనంగా జరుపుకుంటోంది. 'వందే మాతరం' రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని వారసత్వాన్ని ఘనంగా స్మరించుకోవడంతోపాటు, పరేడ్ లోని పది ప్రత్యేకతలేంటో చూద్దాం.
గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగించింది. దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు బయటపడటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. రిపబ్లిమ్ డేను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదంచల భద్రత ఏర్పాటు చేశారు.