కోట్లాది మంది భవిష్యత్తు రాజ్యాంగం

ABN, Publish Date - Jan 26 , 2026 | 12:23 PM

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంలోని ప్రతీ పదం వెనుక ప్రజల భవిష్యత్తు దాగుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

హైదరాబాద్, జనవరి 26: నగరంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని ప్రతీ పదం వెనుక ప్రజల భవిష్యత్తు దాగుందన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని తెలిపారు. ఎన్నో చర్చలు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు.


76 ఏళ్ల క్రితం ఇదే రోజు భారతీయులు ఒక విశేషమైన రాజ్యాంగాన్ని రచించి, ఆమోదించి, చట్టబద్ధం చేసుకున్నామని బాలకృష్ణ గుర్తుచేశారు. ఈ వేడుకల్లో ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

బీజేపీ ఆఫీస్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. కాంగ్రెస్‌పై రామచందర్ రావు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated at - Jan 26 , 2026 | 12:54 PM