Home » RCB
గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో కప్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి విరాట్ గత ఐపీఎల్ ఫైనల్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..
ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరి గెలిచిన జట్టుకు ఎంత నగదు బహుమతిగా అందనుందో తెలుసా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరికాసేపట్లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ మొదలు కాబోతోంది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించి లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి.
ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...
కళ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు.. కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఆదివారంతో తెర పడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్‌లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది.....
క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రజత్ పలు రికార్డులు కొల్లగొట్టాడు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టు విజయాల వెనుక ఉన్న రహాస్యాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.