ఐపీఎల్ 2026: ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ
ABN , Publish Date - May 31 , 2026 | 07:15 PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు 2022లో తొలిసారి కప్పు గెలిచిన గుజరాత్.. ఈ సీజన్ విజేతగా నిలవాలనే కసితో ఉంది. జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి ఐపీఎల్ ఫైనల్ కావడం విశేషం. ఇరుజట్లలో ఏ టీమ్ గెలిచినా.. రెండోసారి కప్ అందుకోనున్నాయి.
ఆర్సీబీ తుది జట్టు:
రజత్ పాటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, డఫీ, హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వెంకటేశ్ అయ్యర్, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, కాక్స్
గుజరాత్ తుది జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు, హోల్డర్, రషీద్ ఖాన్, రబాడా, అర్షద్ ఖాన్, సిరాజ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, ఫిలిప్స్, అనుజ్ రావత్, సాయి కిషోర్
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..