ఐపీఎల్: ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లదే డామినేషన్.. ఈసారి ఏం జరగనుందో?
ABN , Publish Date - May 31 , 2026 | 05:59 PM
అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. మరి సమీకరణాల ప్రకారం.. ఏ జట్టు గెలిచే అవకాశం ఉందంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. మరోవైపు 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే గుజరాత్ ట్రోఫీని ముద్దాడింది. ఇరుజట్లలో ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ట్రోఫీ అందుకునే జట్టుగా నిలిస్తుంది. మరి సమీకరణాల ప్రకారం.. ఏ జట్టు గెలిచే అవకాశం ఉందంటే..
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 18 ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇది 19వ సీజన్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ట్రోఫీ విజేతగా నిలుస్తుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత రికార్డుల ప్రకారం.. కేవలం నాలుగుసార్లు మాత్రమే ఛేజింగ్ చేసిన టీమ్స్ కప్ గెలిచాయి. కేకేఆర్- 2012, 2014, సీఎస్కే-2018, 2023 మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసి కప్ గెలిచాయి. కేకేఆర్‌కు గంభీర్, సీఎస్కేకి ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇది సాధ్యమైంది. మిగిలిన 12 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఇప్పుడు టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడానికే ప్రాధాన్యం చూపే అవకాశం ఉంది. కాగా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అహ్మదాబాద్ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. మరి ఈ సీజన్‌లో ఐపీఎల్ కప్పు ఎవరు నెగ్గుతారో? చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: గెలిచిన జట్టుకు ఎన్ని రూ.కోట్లు వస్తాయంటే..
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..