Share News

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ABN , Publish Date - May 27 , 2026 | 07:52 AM

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.


ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, 5 ఫోర్లు ఉన్నాయి. దీంతో 15 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగు సీజన్లలో(2023-2026) 600 లేదా 600కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. కేఎల్ రాహుల్ (2020, 2021, 2022), క్రిస్ గేల్(2011, 2012, 2013) సీజన్లలో వరుసగా మూడుసార్లు ఈ ఘనత సాధించగా.. తాజాగా వారి రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.


ఇవి కూడా చదవండి:

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

Updated Date - May 27 , 2026 | 07:52 AM