Share News

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

ABN , Publish Date - May 26 , 2026 | 03:23 PM

విరాట్ కోహ్లీ , ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సరదాగా మొదలైన ఈ వివాదం, ఆట ముగిసిన తర్వాత హెడ్‌తో కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడంతో ఒక్కసారిగా ముదిరింది.

 కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!
Travis Scott

స్పోర్ట్స్ డెస్క్: స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ , ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సరదాగా మొదలైన ఈ వివాదం, ఆట ముగిసిన తర్వాత హెడ్‌తో కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడంతో ఒక్కసారిగా ముదిరింది. పలువురు అభిమానులు హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగి, ఆమెను ట్రోల్ చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. కోహ్లీ, హెడ్ వివాదంలో తాజాగా మరో వ్యక్తి చిక్కుకున్నాడు.Virat--Head.jpg


కొందరు అభిమానులు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్‌కు అమెరికన్ రాపర్ ట్రావిస్ స్కాట్‌కు మధ్య తేడా తెలియక కన్‌ఫ్యూజ్‌ అయ్యారు. దీంతో వాళ్లు పొరపాటున హెడ్ అనుకుని రాపర్ ట్రావిస్ స్కాట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు వెళ్లి ఆయన ఫొటోల కింద కోపంతో నెగిటివ్ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'కోహ్లీ, హెడ్ గొడవ పడితే మధ్యలో నేనేం చేశాను' అని ట్రావిస్ స్కాట్ ఫీల్ అవుతున్నట్లు అతడి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మరోవైపు హెడ్ సతీమణి జెస్సికా ఈ వేధింపులపై స్పందిస్తూ తన బాధను పంచుకుంది. కోహ్లీకి తన భర్తకు గొడవ జరిగితే మధ్యలో తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ శర్మను ఔట్ చేయడానికి ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ పట్టినప్పుడు కూడా జెస్సికా ఇలాంటి దుర్భాషలనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న వివాదం ఆమెకు ఆ చేదు జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


ప్రస్తుతం తాము బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియా మొత్తం చెడు వ్యాఖ్యలతో నిండిపోయిందని, తననే కాకుండా, తన స్నేహితుల కుటుంబాలను కూడా వేధిస్తున్నారని జెస్సికా ఆస్ట్రేలియన్ మీడియా సంస్థ 'ది అడ్వర్టైజర్'తో చెప్పింది. క్రీడల్లో కోపతాపాలు సహజమే అయినప్పటికీ ఆటగాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని జెస్సీకా తెలిపింది. ప్రతీ ఆటలోనూ ప్లేయర్స్ మానసిక ఆరోగ్యానికి ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరింది. అలాగే ఫ్యాన్స్ కూడా ఆటగాళ్ల విషయంలో పాజిటీవ్ గా ఉండి మంచి మద్దతు ఇవ్వాలని పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: క్వాలిఫైయర్ మ్యాచ్‌ రద్దు?

ఇన్‌స్టాలో పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!

Updated Date - May 26 , 2026 | 03:39 PM