గాఫ్, సబలెంక ముందంజ
ABN , Publish Date - May 27 , 2026 | 03:07 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల డిఫెండింగ్ చాంప్ కొకొ గాఫ్, టాప్ సీడ్ అరియానా సబలెంక శుభారంభం చేయగా....
మెద్వెదెవ్ అవుట్
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల డిఫెండింగ్ చాంప్ కొకొ గాఫ్, టాప్ సీడ్ అరియానా సబలెంక శుభారంభం చేయగా.. ఆరో సీడ్ డానిల్ మెద్వెదెవ్‌కు తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సబలెంక 6-4, 6-2తో జెస్సికా బౌజాక్ (స్పెయిన్)పై, నాలుగో సీడ్ కొకొ గాఫ్ 6-4, 6-0తో టేలర్ టౌన్‌సెండ్‌పై అలవోకగా నెగ్గారు. కరోలినా ముకోవా (చెక్) 7-5, 6-2తో జకరోవాను, ఇవా జోవిచ్ 6-4, 6-2తో ఏలా (ఫిలిప్పీన్స్)ను, ఒసాక 6-3, 7-6(3)తో లారా సిగ్మంగ్‌ను ఓడించారు. కాగా, నోస్కొవా (చెక్)పై సక్కారి (గ్రీస్) 7-5, 7-6(3)తో గెలిచింది. పురుషుల్లో మెద్వెదెవ్ 2-6, 6-1, 1-6, 6-1, 4-6తో వాల్టన్ (ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నాడు. అయితే, వచ్రాట్ 6-3, 6-4, 3-6, 7-6(6)తో ఫౌరెల్‌పై, లీనర్ టీన్ 6-0, 2-6, 6-0, 6-2తో గ్రరీన్‌పై, గాస్టన్ 6-2, 6-3, 3-6, 2-6, 6-0తో గేల్ మోన్‌ఫిల్స్‌పై నెగ్గారు. గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్ 6-2, 3-0తో ఆధిక్యంలో ఉన్న ప్రత్యర్థి అలెగ్జాండ్రా ముల్లర్ (ఫ్రాన్స్) వాకోవర్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!