చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
ABN , Publish Date - May 26 , 2026 | 06:08 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్ లీగ్ దశలో నిలకడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్ లీగ్ దశలో నిలకడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యకు కూడా ఈ సీజన్ ఓ పీడకలలా సాగింది. ఈ క్రమంలోనే హార్దిక్‌ను ముంబై జట్టు ట్రేడింగ్ ద్వారా వేరే జట్టుకు పంపించబోతోందనే ప్రచారం క్రీడా వర్గాల్లో జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ హార్దిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో మరింత రచ్చ చేస్తోంది.
హార్దిక్ పాండ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక లాప్‌టాప్, ఒక నోట్‌బుక్, ఒక పెన్ , హార్దిక్ మొబైల్ ఫోన్ ఉన్నా ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో కనిపించే ఫోన్ డిస్‌ప్లేపై టైమ్ '07:07' అని చూపిస్తోంది. ఈ నంబర్‌ను చూడటమే ఆలస్యం.. నెటిజన్లు దీనికి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో లింక్ పెట్టడం ప్రారంభించారు. క్రికెట్ ప్రపంచంలో '7' అనే నంబర్ ధోనీ జెర్సీ నంబర్‌గా ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే సీజన్‌లో హార్దిక్ పాండ్య ముంబైని వీడి, ధోనీ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మారబోతున్నాడనే హింట్ ఇవ్వడానికే ఈ పోస్ట్ పెట్టాడంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ చర్చలపై హార్దిక్ కానీ, ముంబై యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
ఇలాంటి తరుణంలో ఓ నెటిజన్.. వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో మార్పుల గురించి సీఎస్కే మాజీ ఆటగాడు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అడుగగా.. 'పతిరణ, 07:07, స్టోక్స్, దూబే, 07:07 మిడిలార్డర్/ ఫినిషింగ్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశూ చెప్పాడనే చర్చ నడుస్తోంది. కాగా పతిరణను గతేడాది సీఎస్కే రిలీజ్ చేయగా.. కోల్‌కతా సొంతం చేసుకుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్‌కతా అతడిని రిలీజ్ చేయనుందనే వార్తలు రాగా.. పతిరణ తిరిగి మళ్లీ సీఎస్కేలోకే వస్తాడనే ప్రచారం ఊపందుకుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దు?
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!