Home » Rayadurg
పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
మండల పరిధిలోని 74 ఉడేగో ళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం క న్నుల పండువగా సాగింది. స్వామి 82వ రథోత్సవంలో భా గంగా ఉదయాన్నే స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకు మార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం కలశస్థాపన, హోమాలు, మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు.
ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు.
విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్‌నాయక్, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు.
పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులు చేపడుతున్నట్లు విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బస్టాండ్‌లో రూ.50 లక్షలతో చేపట్టిన విస్తరణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఉదయం బీటీ ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందించిన 10.30 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు.
పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్‌ను మరోచోటకు తరలిస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డాక్టర్ రాధాకృష్ణ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు.
దహనం వెబ్ సిరీస్ అంశంలో ఆర్జీవీపై అంజనాసిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్‌లో అంజనాసిన్హా పేరు ప్రస్తావించారు. అంజనాసిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవీ ప్రస్తావించారు.
ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని మాల్యం గ్రామంలో వెలసిన కల్లేశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మండలంలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాకులు సిలిండర్ ధర మీద అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గృహ వినియోగం కోసం సరఫరా చేసే సిలిండర్లను కమర్షియల్ కోసం వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లేనిదే ఇంట్లో ఎలాం టి పనులు జరగవు.