Share News

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:34 PM

మండల పరిధిలోని 74 ఉడేగో ళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం క న్నుల పండువగా సాగింది. స్వామి 82వ రథోత్సవంలో భా గంగా ఉదయాన్నే స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకు మార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం కలశస్థాపన, హోమాలు, మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు.

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం
Devotees participating in Rathotsavam

రాయదుర్గం రూరల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని 74 ఉడేగో ళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం క న్నుల పండువగా సాగింది. స్వామి 82వ రథోత్సవంలో భా గంగా ఉదయాన్నే స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకు మార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం కలశస్థాపన, హోమాలు, మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంలో అధిష్టించారు. దేవాలయం వద్ద నుంచి పాదగట్ట వరకు అశేష జనసందోహం మధ్య ఊరేగింపు సా గింది.


ఈ సందర్భంగా డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో సీఐలు జయనా యక్‌, వెంకటరమణ, ఎస్‌ఐలు ప్రసాద్‌, సురేష్‌ పోలీసు బందోబస్తు నిర్వహించారు. రాయదుర్గం, ఉడేగోళం తదితర ప్రాంతాల నుంచి భక్తు లు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గాజులు, బొమ్మల దుకా ణాలు విరివిగా వెలిశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాద వినియోగం, అన్నదానం నిర్వహించినట్లు గ్రూపుదేవాలయాల కార్యదర్శి నరసింహారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బసవరాజు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 18 , 2026 | 11:34 PM