Home » Rains
మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.
మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు మంత్రి సవిత.
ఏపీకి మొంథా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను.. కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం.. పడమర దిశగా పయనించి శనివరం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు గజానికో గొయ్యి మాదిరిగా తయారయ్యాయి.
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకి రాష్ట్ర సర్కార్ దిశానిర్దేశం చేసింది.
‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 3 గంటలుగా.. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని తెలిపారు.
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయంగా మారింది.
జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. హంద్రీనీవా నీటితో అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు చెరువు పూర్తిగా నిండి, మూడు రోజుల కిందట మరువ పారింది. దీనికి వర్షపునీరు తోడవటంతో ప్రవాహం పెరిగింది. ఆ నీరు అనంతపురం రూరల్ మండలంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పలు కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా విశ్వశాంతినగర్, గౌరవ్ రెసిడెన్సీస్, వికాస్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రమైనా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాం...