Montha Cyclone Effect: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో వర్షం
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:14 PM
మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
మొంథా తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, జగిత్యాల కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో వర్షం
ఉద్యోగులకు స్వీట్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు..