Share News

Tirumala: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. తిరుమలలో ముసురు

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:43 PM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది.

Tirumala: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. తిరుమలలో ముసురు

తిరుమల: మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం తిరుమల(Tirumala)లో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది. సాయంత్రానికి చలి తీవ్రత పెరిగింది. తుఫాన్‌ ప్రకటనల నేపథ్యంలో రద్దీ కూడా తక్కువగానే ఉంది. ఆలయ పరిసరాల్లో భక్తులు పలుచగా కనిపించారు.


nani6.jpg

పదిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల ఘాట్‌రోడ్లపై ఫారెస్ట్‌, ఇంజినీరింగ్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. తరుచూ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలపై దృష్టి పెట్టారు. అనుకోకుండా కొండరాళ్లు, చెట్లు విరిగిపడితే వెంటనే స్పందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘాట్‌రోడ్లలో నెమ్మదిగా ప్రయాణించాలని, చెట్ల కింద ఉండకూడదంటూ ప్రకటనలు చేశారు.


nani6.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 28 , 2025 | 12:43 PM