Home » Rains
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు.
సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.
వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెలుతురు తక్కువగా ఉండటం, బురద కారణంగా రోడ్లు జారుతూ ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెలుతురు తక్కువగా ఉండటం, బురద కారణంగా రోడ్లు జారుతూ ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ వర్సిటీ పరిధిలో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేశారు. కామారెడ్డిలో రేపు, ఎల్లుండి, మెదక్ జిల్లాలో రేపు..
హైదరాబాద్‌లో రాబోయే 2 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.