Hyderabad: జంట జలాశయాలకు భారీగా వరద
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:57 AM
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతుంది. ఎగువ నుంచి వరదనీరు వచ్చి హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల్లో చేరుతుంది. ఉస్మాన్‌సాగర్ సామర్థ్యం మొత్తం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.25 అడుగలకు చేరింది.
- గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల
- మూసీలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతుంది. ఎగువ నుంచి వరదనీరు వచ్చి హిమాయత్ సాగర్, గండిపేట(Himayat Sagar, Gandipet) జలాశయాల్లో చేరుతుంది. ఉస్మాన్‌సాగర్ సామర్థ్యం మొత్తం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.25 అడుగలకు చేరింది. దాంతో 2704 క్యూసెక్కుల నీటి దిగవనకు విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్‌సాగర్ 1763.50 సామర్థ్య అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1762 అడుగులకు చేరింది. 2300 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో మూసీ నదిలో వరదనీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది.
నార్సింగి పరిధిలో సర్వీస్ రోడ్ల మూసివేత
ఇటీవల కొంత వరద ఉధృతి తగ్గడంతో శుక్రవారం సర్వీస్ రోడ్డును ఓ పక్కన రోజంతా తెరచి ఉంచారు. సాయంత్రం వరద పెరగడంతో రెండు పక్కల సర్వీస్ రోడ్లను మూసివేశారు. నార్సింగ్ పోలీస్‌స్టేషన్(Narsingh Police Station) వైపు ఉన్న సర్వీస్ రోడ్డును మూసివేసి రాకపోకలను ఆపేశారు. మంచిరేవుల, నార్సింగ్ మధ్య ఉన్న కాజ్‌వే పై మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ సర్వీస్ రోడ్డు ప్రాంతాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కాగా, గండిపేట జలాశయం నుంచి దిగువనకు వరద ఉధృతి తగ్గడంతో నార్సింగ్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-18ఏ వద్ద సర్వీస్ రోడ్డును తిరిగి తెరిచారు. రాత్రి 9 గంటల సమయంలో రెండు వైపులా సర్వీస్ రోడ్లపై వాహనాల రాకపోకలకు అనుమతించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News