Home » Rains
భానుడి భగ.. భగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలోనూ వేసవి తరహాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఎల్‌నినో ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 173మి.మీకు కేవలం 50మి.మీ. నమోదైంది. అది కూడా కొన్ని మండలాలకే పరిమితమవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కేరళంలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు.
నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంపై ఉన్నతస్థాయి అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని వెల్లడించారు.
ఆలస్యమైతనేం.. నీటి రాకడ మొదలైంది. అడుగంటిన తుంగభద్ర జలాశయంలోకి కొత్తనీరు చేరుతోంది.
మహారాష్ట్రలో భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. థానే జిల్లా భివండి, పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో స్పైడర్ మ్యాన్ వేషధారణలో అందరికీ సహాయం చేస్తున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్‌లోని పటాన్‌లో సోమవారం తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గల్లంతయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో సవాళ్లు వెక్కిరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న వర్షం పడినా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా మరి కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
రోజులు గడుస్తున్నాయి.. కార్తెలు మారిపోతున్నాయి.. చినుకుల జాడ కనిపించడం లేదు.