Heavy Rains: వాతావరణశాఖ హెచ్చరిక.. రెండు రోజులు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:56 AM
సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... మంగళవారం తిరువణ్ణామలై, కళ్లకుర్చి, తేని, దిండుగల్, మదురై, శివగంగ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
చెన్నై: సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... మంగళవారం తిరువణ్ణామలై, కళ్లకుర్చి, తేని, దిండుగల్, మదురై, శివగంగ తదితర జిల్లాలు, బుధవారం వేలూరు, రాణిపేట, కాంచీపురం(Ranipet, Kanchipuram), చెంగల్పట్టు, తిరువణ్ణామలై,

నీలగిరి(Neelagiri), తేని, దిండుగల్, మదురై తదితర జిలాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లో రానున్న 48 గంటల్లో పగటి పూట ఎండ తీవ్రత, సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News