Home » Rain Alert
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది.
తెలంగాణ జిల్లాలకు అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
ఇప్పటికే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన జారీ చేయడంతో నగరవాసులు ఉలిక్కి పడుతున్నారు.
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్‌పుర, సోమాజిగూడ, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరడంతో చెరువులని తలిపిస్తున్నాయి.
నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.