Telangana Heavy Rains: తెలంగాణ జిల్లాలకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం..
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:31 PM
తెలంగాణ జిల్లాలకు అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ జిల్లాలకు అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది (upcoming rainfall Telangana). రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కాసేపట్లో వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది (IMD alert Telangana).
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది (rain warning Telangana districts). అలాగే ఈ నెల 25వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అది ఈనెల 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, తీర ప్రాంతంలో ఈనెల 27 నాటికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే హైదరాబాద్‌లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోని ఎల్బీ నగర్, ఛార్మినార్, ఉప్పల్, అబిడ్స్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ట్వీట్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..
హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు రంగం సిద్ధం..
Read Latest Telangana News And Telugu News