Share News

CM Revanth On Rains: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:06 PM

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.

CM Revanth On Rains: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్
CM Revanth Alerted Officials On Rains

హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్‌గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.


అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు.


దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రాతోపాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.


Also Read:

OG సినిమా రేట్లపై వివాదం.. హైకోర్టులో తాత్కాలిక ఊరట

లక్షా 22వేల కోట్ల ఆణు శక్తి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

For More Latest News

Updated Date - Sep 25 , 2025 | 07:01 PM