Share News

Pawan Kalyan OG Ticket Rates: OG సినిమా రేట్లపై వివాదం.. హైకోర్టులో తాత్కాలిక ఊరట

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:41 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG (They Call Him OG) సినిమాకు సంబంధించి టికెట్ రేట్లపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో OG మూవీ యూనిట్‌కు తాత్కాలిక ఊరట లభించింది.

Pawan Kalyan OG Ticket Rates: OG సినిమా రేట్లపై వివాదం.. హైకోర్టులో తాత్కాలిక ఊరట
Pawan Kalyan OG ticket Rates Issue

హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG (They Call Him OG) సినిమాకు సంబంధించి టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో OG మూవీ యూనిట్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ రోజు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, OG సినిమా టికెట్ ధరలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రేపటి వరకూ సస్పెండ్ చేసింది.


కాగా, ఇటీవల 'OG' సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ సర్కార్ మెమో జారీ చేసింది. అయితే, ఈ మెమో.. సాధారణ టికెట్ ధరలతోపాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు మెమోను తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. అయితే, నేడు సినిమా రేట్లపై OG యూనిట్‌కు హైకోర్ట్‌లో స్వల్ప ఊరట దక్కింది. OG సినిమా రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రేపటి వరకు సస్పెండ్ చేసింది.


Also Read:

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు

For More Latest News

Updated Date - Sep 25 , 2025 | 06:18 PM