Share News

AP Mega DSC: అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ..

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:28 PM

1994 నుంచి 2025 మధ్య 14 డీఎస్సీలను సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వహించారు. దీంతో 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను తెలుగుదేశం, కూటమి ప్రభుత్వాలు దక్కించుకున్నాయి.

AP Mega DSC: అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ..
CM Chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ ఉత్సవ్ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి బయలుదేరారు. మొత్తం 7 ప్రత్యేకమై బస్సులో సభా ప్రాంగణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాసేపు బస్సు డ్రైవింగ్ సీట్‌‌లో కూర్చుని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. జిల్లాల వారీగా నేతలకు బస్సులు కేటాయింపు చేశారు.

అనంతరం సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఉత్సాహ ధ్వనుల మధ్య సభ ప్రారంభమైంది. డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందజేయనున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నారని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


1994 నుంచి 2025 మధ్య 14 డీఎస్సీలను సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వహించారు. దీంతో 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను తెలుగుదేశం, కూటమి ప్రభుత్వాలు దక్కించుకున్నాయి. 2025 ఏడాదిలో మెగా డీఎస్సీ ప్రక్రియను 150 రోజుల్లో మంత్రి నారా లోకేష్ పూర్తి చేశారు. 106 కేసులతో మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించినా అడ్డంకులను అధిగమించి డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కుటుంబసభ్యులతో కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు తరలివచ్చారు.


Also Read:

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..

Updated Date - Sep 25 , 2025 | 05:39 PM