Jagapathi Babu On ED: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:58 PM
సాహితీ ఇన్ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి నటుడు జగపతి బాబును ఈడీ విచారించింది.
హైదరాబాద్: నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఎదుట హాజరయ్యారు. జగపతి బాబుని నాలుగు గంటలపాటు ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఆయన్ను ఈడీ విచారణకు పిలిచింది. సాహితీ తరఫున పలు ప్రకటనలో నటించిన జగపతిబాబుకు, సాహితీ కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఈడీ విచారించింది. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్‌లో నుంచి జగపతిబాబుకు నగదు బదిలీ అయినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినందున ఆయన్ని పిలిచి విచారించినట్లు వెల్లడించారు. జగపతిబాబుకు సాహితి నుంచి వచ్చిన డబ్బులకు సంబంధించి సమాచారం తెలుసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
సాహితీ ఇన్ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి, నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సాహితీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది. సాహితీ నిర్వాహకులు రూ.126కోట్లు కొనుగోలు దారుల నుంచి వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతో పలు ఆస్తులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. సాహితీ కేసులో మరింత లోతైన విచారణలో భారీఎత్తున స్కామ్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే సాహితీ ఇన్ఫ్రాకు ప్రకటనలు చేసిన నటినటులను ఈడీ విచారిస్తోంది.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..