Rain Alert: మరికాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:59 PM
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్. మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ అధికారులు ప్రకటించారు. సరిగ్గా రాత్రి 8 గంటల నుంచి 10 మధ్య వర్షం దంచికొట్టనుందని తెలిపారు. ముఖ్యంగా నగరం పరిధిలోని..
హైదరాబాద్, సెప్టెంబర్ 23: భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్. మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ అధికారులు ప్రకటించారు. సరిగ్గా రాత్రి 8 గంటల నుంచి 10 మధ్య వర్షం దంచికొట్టనుందని తెలిపారు. ముఖ్యంగా నగరం పరిధిలోని కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, ఖుత్బుల్లాపూర్, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, గాజుల రామారం, చందానగర్, అమీన్‌పూర్, బీరమ్‌గూడ నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడనున్నట్లు పేర్కొన్నారు. 8.15 నుంచి 10 గంటల మధ్య వర్షం కురుస్తుందని పేర్కొ్న్నారు.
మేఘావృతమైన ఆకాశం..
గత కొద్ది రోజులు సాయంత్రం అయితే చాలు వర్షం దంచి కొడుతోంది. పగలంతా ఎండగా.. సాయంత్రం అయితే చాలు వాతావరణం చల్లబడిపోతోంది. ఇక భారీ వర్షాల కారణంగా మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ వర్షం కారణంగా ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని.. అధికారులు సైతం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇకపోతే.. వరుస వర్షాల కారణంగా నగరంలో రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read:
Hyderabad Water Supply Disruption: బీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..
Bihar Assembly polls: ఈసీ ప్రకటన తర్వాతే సీట్ల పంపకాలు.. ఎన్డీయే వ్యూహం ఇదే
For More Telangana News and Telugu News..