Hyderabad Water Supply Disruption: బీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:53 PM
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 24న నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. HMWSSB చేపడుతున్న మరమ్మతు పనుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది.
హైదరాబాద్: నగరంలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 24 (బుధవారం)న నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ఫేజ్-2 నీటి ప్రాజెక్టులో లీకేజీలు వస్తుండటంతో వాటిని బిగించేందుకు మరమ్మతులు చేస్తున్నారు. కలబ్‌గూర్ నుండి హైదర్‌నగర్ వరకు పంపింగ్ మెయిన్‌లో పెద్ద లీకేజీలు ఉన్నాయని వాటర్ బోర్డు (HMWSSB) తెలిపింది. ఈ నేపథ్యంలోనే 24 గంటల పాటు మరమ్మతులు జరగనున్నాయని వెల్లడించింది. అందువల్ల పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ కానున్నట్లు పేర్కొంది.
నీటి సరఫరా ఆగే ప్రాంతాలు ఇవే:
ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, బల్క్ వాటర్ కనెక్షన్లు, ఆఫ్ టేక్ పాయింట్లు, ఎర్రగడ్డ, SR నగర్, అమీర్‌పేట్, KPHB కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని HMWSSB సూచించింది.
Also Read:
ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
For More Latest NEws