Share News

Hyderabad Rain Alert: బీ అలర్ట్.. రెండు గంటల్లో భారీ వర్షం.!

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:46 PM

హైదరాబాద్ సిటీలోని ప్రజలు ప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Hyderabad Rain Alert: బీ అలర్ట్..  రెండు గంటల్లో భారీ వర్షం.!
Hyderabad Rain Alert

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అయితే, మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మెహదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్, మాసబ్‌ ట్యాంక్, నాంపల్లి, లకిడికాపూల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అలాగే ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల వద్ద నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Also Read:

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..

For More Latest News

Updated Date - Sep 25 , 2025 | 04:59 PM