Home » Rain Alert
ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఏర్పడిందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని, రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు.
తెలంగాణ - రాయలసీమ - తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావ కొనసాగుతోందని ఏపీ వాతావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఎల్‌నినో ప్రభావంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని తెలిపారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.