Home » Rahul Gandhi
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. రూపాయి విలువ పతనం, ఇంధనం ధరలు పెరగడం రాబోయే ద్రవ్యోల్బణ సునామీకి సంకేతాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని ఆక్షేపించారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బుధవారంనాడు పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన బస్ అండ్ ట్రక్ బాడీ బిల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇటీవల పార్లమెంట్ మెట్లపై నిలబడి టీ, పకోడీ తీసుకోవడంపై అమిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.
ఇంధన భద్రత విషయంలో కేంద్రం రాజీ పడిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్షాలు గురువారంనాడు నిరసనకు దిగాయి.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టడంలో విపక్ష నేత విఫలమయ్యారని రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
లోక్‌సభ స్పీకర్ అంటే ఇంతకు ముందు తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ గత సమావేశాల్లో తొలిసారి విపక్ష నేతను మాట్లాడనివ్వలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.