Rahul Gandhi Fishing Day: చెరువులో దిగి మత్స్యకారులతో సందడి చేసిన రాహుల్
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:44 PM
బెగుసరాయ్‌లో మత్స్సకారులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, జాలర్లు ఎన్నో సమస్యలు, పోరాటాలు ఎదుర్కొంటున్నప్పటికీ వారి పనితీరు చాలా ఆసక్తిగా ఉందని రాహుల్ పేర్కొన్నారు.
బెగుసరాయ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్‌లోని స్థానిక మత్స్యకారులతో ఆదివారంనాడు సందడి చేశారు. మత్స్యకారులు చేపలు పడుతుంటడం చూసి పడవలో చెరువు మధ్యకు చేరుకున్నారు. పడవ లోంచి కాలువలోకి దూకి, ఈదుకుంటూ వారి వద్దకు వెళ్లారు. వారితో కలిసి వల పట్టుకుని చేపలు పడుతూ ముచ్చటించారు. అనంతరం వారితో ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాహుల్ తన ట్రేడ్ మార్క్ టీ-షర్ట్, నలుపు రంగు ట్రౌజర్‌తో కనిపించగా, ఆయనతో పాటు వికాస్ శీల్ ఇన్సాఫ్ చీఫ్ (VIP), మహాగట్‌బంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహానీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కూడా సందడి చేశారు. జాలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. బిహార్ ఆర్థికవ్యవస్థలో మత్స్యకారులు కీలకపాత్ర పోషిస్తున్నారని రాహుల్ ఎన్నికల ప్రచారంలో పలుమార్లు పేర్కొన్నారు. మత్స్యకారుల వేటపై నిషేధం ఉండే మూడు నెలలు ప్రతి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా 'ఇండియా' కూటమి హామీ ఇచ్చారు.
చాలా హ్యాపీగా ఉంది
బెగుసరాయ్‌లో మత్స్సకారులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, జాలర్లు ఎన్నో సమస్యలు, పోరాటాలు ఎదుర్కొంటున్నప్పటికీ వారి పనితీరు చాలా ఆసక్తిగా ఉందని అన్నారు. వారి కఠోర శ్రమ, అభిరుచి చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి హక్కులు, గౌరవాన్ని పాదుకొలిపేందుకు తాను బాసటగా నిలుస్తానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి