Rahul Gandhi: 5న కరూర్‌కు రాహుల్‌గాంధీ
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:09 AM
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నవంబర్ 5వ తేదీ కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్ గత నెల 27న కరూర్ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే.
చెన్నై: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నవంబర్ 5వ తేదీ కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్(Vijay) గత నెల 27న కరూర్ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి సహా పలువురు పరామర్శించి ఓదార్చారు.

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బీజేపీకి చెందిన సీనియర్ నటి హేమమాలిని(Hemamalini)లతో పాటు ఎన్డీఏ ఎంపీల బృందం కరూర్‌లో ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఇన్నాళ్లూ అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్‌గాంధీ ప్రస్తుతం తిరిగొచ్చారు. ఆయన నవంబర్ 5వ తేదీన కరూర్‌కు వస్తారని, బాధితులను పరామర్శిస్తారని టీఎన్‌సీసీ నేతలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News