Home » Puttaparthy
ప్రతి ఒక్కరు జాతీయ భావం పెంపొందించుకోవాలని కలెక్టర్ చేతన పిలుపునిచ్చారు. హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా గురువారం సత్యసాయి సూపర్‌స్పెషలిటీ ఆసుపత్రి నుంచి వై జంక్షన వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైజంక్షన వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. దేశభక్తి ఉట్టిపడేలా అందరిచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన రైతుల పొలాలను తహసీల్దార్ ఉదయ్‌శంకర్‌రాజు పరిశీలించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ఓ పట్టాన తెగదే..’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ చేతన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్పందించి రొద్దం తహసీల్దార్‌తో ఆరాతీశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.
హిందూపురం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రహదారులు, వంతెన నిర్మాణం కోసం రూ.45కోట్లు నిధులు విడుదలైనట్లు మున్సిపల్ చైర్మన రమేష్, ఎమ్మెల్యే పీఏ వీరయ్య తెలిపారు.
గోరంట్లలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలోని బేతేలు చర్చి వీధి, పెన్షనర్స్ భవనం వెనుక వీధుల్లో వరస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని మాజీ మంత్రిపల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గూ నిపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు జుటూరు ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీరాములు ప్రమాణ స్వీకారానికి పల్లె హాజరై మాట్లాడారు.
మండల కేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలో గుంజేపల్లి ఫీడర్‌కు గ్రహణం పట్టింది. చిన్న చినుకు పడ్డా, గాలి వీచినా విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. బ్రేకర్‌లు ట్రిప్ కావడంతో విద్యుత సమస్య అధికమవుతోంది.
రబీసీజనలో విరివిగా వరిసాగుచేసే రైతన్నలు మొక్కజొన్న సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరి సాగుకు ఖర్చులు భారం కావడంతోనే మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన మొదలుకాగానే బీపీటీ, సోనామసూరీ రకం వరిపైర్లు సిద్ధం చేసేవారు.
మండలపరిధిలోని గోళ్లవారి పల్లి సమీపంలో ఉపాధి నిధులతో పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు నిర్మించారు. అయితే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తరువాత తన కేమీ సంబంధం లేదని అలాగే వదిలేశారు. మరి ఆ తొట్టెలకు నీటి సౌకర్యం ఎవరు కల్పిస్తారో తెలియక పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు.