CHAIRMAN RAMESH: పట్టణాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:37 AM
పురం పట్టణ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు.
హిందూపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పురం పట్టణ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని ముక్కడిపేట, లింకంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే పీఏ వీరయ్యతో కలిసి చైర్మన మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోపు పట్టణంలోని అన్ని రహదారులు సీసీ రోడ్లు అవుతాయన్నారు. శివారు ప్రాంతాల్లో సైతం రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ, నాయకులు అనిల్‌కుమార్, షఫి, నెట్టప్ప, అమరనాథ్, మస్తాక్, అంజాద్, నవీన పాల్గొన్నారు.