MINISTER SAVITHA: కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తాం
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:09 AM
గోరంట్ల మండలంలో అనువైన చోట యాదవ కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య గోరంట్లకు చెందిన యాదవ సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.
పెనుకొండ టౌన, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): గోరంట్ల మండలంలో అనువైన చోట యాదవ కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య గోరంట్లకు చెందిన యాదవ సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. మంత్రి మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి కల్యాణమండపం కోసం స్థల పరిశీలన వేగవంతం చేస్తామన్నారు. కల్యాణమండపం నిర్మాణానికి ఎంపీ బీకే పార్థసారథి నిధులు మంజూరయ్యేలా సిఫార్సు కూడా చేస్తానన్నారు. గుట్టూరు సూరీ పాల్గొన్నారు.
మంత్రికి ఆహ్వానం
పెనుకొండ(ఆంధ్రజ్యోతి): కడపలో 14వ తేదీన ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి కడప ఇనచార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను నాయకులు ఆహ్వానించారు. మంగళవారం ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోబ్రేనాయక్, జయకృష్ణ మంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.
రామచంద్రారెడ్డికి ఘన నివాళి
పెనుకొండ రూరల్(ఆంధ్రజ్యోతి): పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లి సమీపంలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సవిత, పార్టీశ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. సవిత తండ్రి ఎస్. రామచంద్రారెడ్డి సమాధి వద్దకు నాయకులు తరలివెళ్లారు. ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్‌ట్రస్ట్ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.