Share News

JUDGE: రాజీమార్గం ఎంతో ఉత్తమం

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:07 AM

రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్‌ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.

JUDGE: రాజీమార్గం ఎంతో ఉత్తమం
Judge Kompalle Shailaja giving documents to the party members

హిందూపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్‌ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు. ఎనిమిది సివిల్‌ తగాదాలు పరిష్కరించి కక్షిదారులకు రూ.1,25,90,000ర పయోజనం చేకూరేలా తీర్పునిచ్చారు. ఏడు ఈపీలు పరిష్కరించి రూ.1,01,99,000, 12 చెక్‌బౌన్స కేసులు పరిష్కరించి రూ.32.42లక్షలు ఇప్పించారు. నాలుగు భర ణం కేసుల ద్వారా రూ.3లక్షలు అందించారు. మరో 27 ఐపీసీ కేసులు, రెం డు విడాకుల కేసులు పరిష్కరించారు. 85అక్రమంగా మద్యం తరలించే కేసులు పరిష్కరించి రూ.3.78లక్షలు అపరాధ రుసుం విధించారు. ప్రీలిటికేషన 38కేసులు పరిష్కరించి బ్యాంకులకు రూ.25.80లక్షలు ఇచ్చేలా పరిష్కరించారు. 62చిన్నపాటి తగాదాలుపరిష్కరించి రూ.4.06లక్షలు అ పరాధ రుసుము వసూలుచేశారు. సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వర్లు నాయక్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి లలితలక్ష్మీ హరికకోట, ప్రత్యేక న్యాయాధికారి రమణయ్య, న్యాయవాదులు, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

పెనుకొండ టౌన(ఆంధ్రజ్యోతి): జాతీయ మెగా లోక్‌ అదాలతలో 229కేసులు పరిష్కారమయ్యాయి. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో సీనియర్‌ న్యాయాధికారి వాసుదేవన ఆధ్వర్యంలో మెగా లోక్‌ అదాలత నిర్వహించారు. బ్యాంక్‌, సివిల్‌, క్రిమినల్‌, తదితర కేసులు రాజీమార్గంలో కేసులు ఉపసంహరించుకున్నారు. పలవురు న్యాయాధికారులు, న్యాయవాదులు, బ్యాంకర్లు, పోలీసులు పాల్గొన్నారు.


249 కేసుల పరిష్కారం

మడకశిరటౌన (ఆంధ్రజ్యోతి): మడకశిర జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణంలో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్‌ అదాలతలో 249 కేసులు పరిష్కరించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆర్‌.అశోక్‌కుమార్‌ లోక్‌అదాలతలో పాల్గొని కేసులను పరిష్కరించారు. ఎక్సైజ్‌ కేసులు 132 పరిష్కారం కాగా రూ.7.73లక్షల జరిమానా విధించారు. 24 క్రిమినల్‌ కేసులకు రూ.49వేలు, 86 ఎస్‌టీసీ కేసులకు రూ.31వేలు, ఎనఐ యాక్టు కేసులు నాలుగు పరిష్కారం కాగా రూ.10లక్షలు, సివిల్‌ కేసులు మూడు పరిష్కారం కాగా రూ.10.32లక్షలు మొత్తం రూ.28.85లక్షలు వివిధ కేసుల ద్వారా వసూలైనట్లు తెలిపారు. రాజీ కాదగ్గ కేసులు సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని న్యాయాధికారి అన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:08 AM