FARMERS: వంతెన నిర్మాణంతో రైతుల్లో ఆందోళన
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:28 AM
మండలంలోని బూదిలి సమీ పం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో పంటలు సాగుచేస్తున్న రైతు లు ఆందోళనకుగురవుతుందన్నారు. బూదిలి వద్దనున్న పాత వంతెన దెబ్బతినడంతో, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి రూ.8.52కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
పంటలకు నీరు రావంటున్న రైతులు
గోరంట్ల, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని బూదిలి సమీ పం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో పంటలు సాగుచేస్తున్న రైతు లు ఆందోళనకుగురవుతుందన్నారు. బూదిలి వద్దనున్న పాత వంతెన దెబ్బతినడంతో, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి రూ.8.52కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. జూలై 2న మంత్రి సవిత భూమి పూజ చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ ప్రస్తుతం వంతెన పనులు చేపట్టడానికి సిద్ధమయ్యారు. నదిలో నీరు అధికంగా ఉండడంతో పనులు చేపట్టడానికి కష్టమవుతుందని భావించినట్లు తెలిసింది. మండలంలోని పలు చెరువులకు నీరు వెళ్లేందుకు వీలుగా నదికి అడ్డంగా పూర్వం ఒడ్డు నిర్మించారు. ప్రస్తుతం తమ అవసరాలకోసం ఒడ్డు తెగొట్టడం, లేదా రంధ్రాలు చేయడం వల్ల నీటి నిలువ తగ్గించవచ్చని కాంట్రాక్టర్ భావించి ఆప్రయత్నంలో ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఒడ్డు తొలగిస్తే నీరు వృథా అవడం వల్ల పంట సాగుచేసిన రైతులు నష్టపోతారని, కంట్రాక్టర్ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు నదిని పరిశీలించినప్పుడు రైతులకు ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం కోసం ఇంజనర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ పనులు చేసుకోవాలని సూచించారని రైతులు పేర్కొన్నారు. ఒకవేళ రాత్రి సమయంలో ఒడ్డుకు ముంపు వాటిల్లితే అందుకు కాంట్రాక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతులు హెచ్చరించారు.