MLA RAJU: నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:58 PM
మడకశిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపను చేశారు.
అగళి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మడకశిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపను చేశారు. గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో మడకశిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేపడతానన్నారు. రామనపల్లి గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కొమరేపల్లి పంచాయతీ భవన శంకుస్థాపన చేశామన్నారు. అగళిలో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం నర్సంబూది గ్రామంలో అయ్యప్పస్వామి గుడికి వెళ్లేందుకు నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఒక్కళిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, మడకశిర మార్కెట్‌యార్డ్ చైర్మన గురుమూర్తి, అధికార ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ నుండి టీడీపీలో చేరిక: మండలంలోని వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలోని కొమరేపల్లి సర్పంచ రామన్న, ఎంపీటీసీ బసవరాజ్, ఆలూడి సర్పంచ బసవరాజ్, వైసీపీకి రాజీనామాచేశారు.కొమరేపల్లి గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో శనివారం వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు.
క్రీడాస్ఫూర్తితో పాల్గొనాలి: క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో అగళి వాలీబాల్‌క్లబ్ ఆధ్వర్యంలో మెగా టోర్నమెంట్‌ను శనివారం నిర్వహించారు. 25జట్లు పోటీలకు హాజరైనట్లు తెలిపారు.
మెరుగైన సేవలు అందించండి
మడకశిర రూరల్ (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శనివారం మండలంలోని గోవిందాపురం, గంగుళవాయిపాళ్యం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయాల భవనాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, రైతు సేవా కేంద్రాలను వారు ప్రారంభించారు. వారు మాట్లడుతూ వైసీపీ పాలనలో ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారని, సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. గుండమల తిప్పేస్వామి గోవిందాపురం గ్రామ సచివాలయ నూతన భవనాలను ప్రారంభించారు. ఎంపీడీవో సోనీబాయి, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. శనివారం మండలంలోని గుండుమలలో రూ.1.92 కోట్లతో నిర్మించిన కేజీబీవీ జూనియర్ కళాశాల నూతన భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులు చదువు కోసం పెద్దపీట వేసిందన్నారు. మంత్రి నారాలోకేశ విద్యార్థులకు కావలసిన సదుసాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అనంతరం జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని దిశాను అభినందించారు. ఏపీఎ్‌సఎస్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవరాజు. ఎంఈఓ భాస్కర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, కుంచిటిగ వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ,మండల కన్వీనర్ నాగరాజు, చంద్రప్ప పాల్గొన్నారు.