IMMUNISATION: చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:14 AM
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ సురే్‌షబాబు ఆదేశించారు.
హిందూపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ సురే్‌షబాబు ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్‌పోలియో నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ప్రపంచంలో పోలియోరహిత భారతగా నిలిపేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. 23 తరువత కూడా రెండ్రోజులపాటు ఇంటింటికి తిరిగి ఎవరైనా వేయించుకోకుండా ఉంటే వారిని గుర్తించి చుక్కలు వేయాలన్నారు. అవసరమైతే మొబైల్ బూతల ద్వారా చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచఓ వన్నప్ప, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.