CHAIRMAN : పట్టణ అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:10 AM
పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు.
హిందూపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. శనివారం పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో రూ.22లక్షలతో పార్కుకు ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వారు మాట్లాడుతూ కాలనీవాసులు పార్కుకు ప్రహరీ నిర్మించాలని అడిగిన వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరు చేయించామన్నారు. వీటితోపాటు త్వరలోనే కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తారన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు వెంకటేశ, రూరల్ మండల కన్వీనర్ రాము, నాయకులు నాగరాజు, రవీంద్రనాయుడు, రవిచంద్ర, పవనకుమార్, ప్రసాద్, భార్గవ్, అమీన పాల్గొన్నారు.