Home » Puttaparthi
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర జాతీయ రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ గురువారం పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, బీసీ.జనారఽ్ధన రెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మండల పరిధిలోని కమ్మ వారిపల్లి నుంచి పాత బత్తలపల్లి మీదుగా కొండేపాళ్యం వరకు రోడ్డుకు ఇరువైపుల గడ్డి ఏపుగా పెరింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఏపుగా పె రిగిన గడ్డిని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క మ్మవారిపల్లి నుంచి పాత బత్తలపల్లి, చండ్రాయునిపల్లి, కొండేపాళ్యం మీదుగా కదిరికి వెళ్లే ఈ రహదారి 18 కిలోమీటర్లు ఉంది.
సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో వివిధ కళాసంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి అనంతపురానికి చెందిన శ్రీనృత్య కళాని లయం శ్రీమతి సంధ్యామూర్తి కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కి సాన - అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వ్యవసాయం పె ట్టుబడి సాయం అందిస్తున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతు కుం ట గ్రామంలో పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ గ్రామసభను బుఽధ వారం నిర్వహించారు.
మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 ఎదుట చెత్తపేరుకుపోయింది. దీంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు చెత్తను, వస్తువులను తెచ్చి సచివాలయం ఎదుట పడేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. నాస్తికులను కూడా బాబా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా నమ్మారని సీఎం తెలిపారు.
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. బాబా చూపిన బాటలో అందరం నడుద్దామని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు.