Home » Ponguleti Srinivasa Reddy
మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీశ్‌రావు భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. భూదాన్ భూమిని ఆయన కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది? అని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ సర్వే నెం.271లోని 4-32 ఎకరాల అసైన్డ్ భూమిని హరీశ్ రావు పరపతిని ఉపయోగించుకుని ఆయన మామ 1.8.2023న 22ఎ నుంచి తొలగించి పట్టా భూమిగా మార్పు చేసుకున్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో పేదలకు అందాల్సిన ఆస్తులపై కన్నేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఆ భూములను కొల్లగొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేశారని విమర్శించారు.
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రైతుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆడుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్, ఎత్తాయిన (హరీశ్‌రావు) అక్రమాస్తుల వివరాలన్నీ కేసీఆర్ కుమార్తె కవితకే పూర్తిగా తెలుసునని, వాటి గుట్టు ఆమె ద్వారానే బయటకువస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చేతనయితే ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
22A భూములపై అసెంబ్లీలో చర్చిద్దామని.. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. 22A అడ్డుపెట్టుకుని దందాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
22ఏ వివాదంపై అసెంబ్లీ వేదికగానే వాస్తవాలను ప్రజల ముందు పెడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండేవి.. తమ ప్రభుత్వం వచ్చాక ఎంత విస్తీర్ణం ఉందనే వివరాలను సభ ముందు ఉంచుతామని అన్నారు
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు సంక్షేమం అందించడం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినా సంక్షేమం ఆగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతనకల్, మద్దిరాల మండలాల్లో 15 గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలను ఇస్తున్నామన్నారు.