TG GOVT: గుడ్ న్యూస్.. భూదార్ కార్డులపై కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:34 PM
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): భూదార్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) మీడియాతో మాట్లాడి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు. రెండో విడతలో 373 నక్షలేని గ్రామాల్లో సర్వే చేస్తామని..ఎన్నికల తర్వాత భూదార్ కార్డులు అందజేస్తామని తెలిపారు.
ధరణిని బంగాళాఖాతంలో వేశాం: మంత్రి పొంగులేటి

రెండేళ్ల ప్రజా పాలనలో కేసీఆర్ హయాంలో తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేశామని విమర్శించారు. ప్రజలు మెచ్చే భూ భారతి చట్టాన్నితమ ప్రభుత్వంలో తీసుకువచ్చామని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నక్షలేని 5గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామని వివరించారు. ఇవాళ(బుధవారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడారు. 6వేల మంది వీఆర్ఏలను నియమించామని తెలిపారు.
3490మంది సర్వేయర్లకు లైసెన్స్‌లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి సర్వేయర్లను అలాట్ చేశామని తెలిపారు. రోవర్స్ కొనుగోలు చేసి సర్వేయర్లకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా కుప్ప కూల్చారని..తమ ప్రభుత్వం సరిచేస్తున్నామని వివరించారు. 59 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను అధునాతనంగా నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
For More TG News And Telugu News