Share News

Indiramma Houses : రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు: మంత్రి శ్రీనివాసరెడ్డి

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:21 PM

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే, రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్, తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Indiramma Houses :  రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు: మంత్రి శ్రీనివాసరెడ్డి
Telangana Indiramma houses

ఖమ్మం జిల్లా : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే, రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్, తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో 10 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉందని, అయితే, కేసీఆర్ తీవ్ర నిర్లక్ష్యం చూపారని మంత్రి ఆరోపించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరేంపులలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి, ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.


కేవలం కమీషన్ కోసం ధనిక తెలంగాణా రాష్ట్రాన్ని దగా చేసి కేసీఆర్, కాళేశ్వరం కట్టాడని మంత్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 'కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది, ప్రారంభించింది కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం కూలిపోయింది. ఎక్కడా అవినీతి జరగకుండా పేదవారికి ఇళ్లు ఇచ్చే విధంగా సంస్కరణలు తీసుకోచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాము. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకులు హేళనగా మాట్లాడారు. గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రబుద్ధులు ఇళ్లు ఇస్తామని ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ గ్రాఫిక్స్ బొమ్మలు చూపించారు. ఆనాటి పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను కట్టబోతున్నాం. 9 వేల 700 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ కి శంకుస్థాపన చేసాం. రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం.' అని మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 03:32 PM