Home » Politics
మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఏపీ కేబినెట్ నవంబర్ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.
జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని.. ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తామన్నారు. జీవన్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే అక్కడి మంత్రి లక్ష్మణ్ పరిష్కరిస్తారని చెప్పారు. మంత్రుల్లో తనకంటే సీనియర్లు ఉన్నారని. తనకంటే జూనియర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.
జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన పోలీసుల అమర వీరుల సేవలను స్మరిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శ్రద్దాంజలి ఘటించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అధికారికంగా 'X' వేదికగా ప్రకటన విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు అయ్యాయి.
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇండియా స్వదేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ (INS Vikrant) 2022లో నౌకాదళంలో ప్రవేశపెట్టబడింది. ఇది దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీపావళి సందర్భంగా నిర్విరామంగా స్వీట్ షాప్స్‌పై రైడ్స్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు.. టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపించారు. నగరంలో 45 స్వీట్ షాపుల్లో తనిఖీలు విస్తృతం చేశారు.
దేశంలోని ప్రజలకు ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించి బహుమతి ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.