Share News

Kavitha: గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి: కవిత

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:27 PM

గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Kavitha: గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి: కవిత
Kavitha

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రూపు-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్టు తనకు నిరుద్యోగులు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగులు లేవనెత్తుతున్న అంశాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.


గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్‌కి మరొక హాల్ టికెట్ నంబర్ ఇవ్వడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని లేఖలో రాసుకొచ్చారు. గ్రూపు-1 పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని తెలుగు మీడియం అభ్యర్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఇటీవలే గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన 562 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

KCR On BRS Leaders Meeting: కేసీఆర్‌తో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Kavitha Visiting Yadadri Temple: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 23 , 2025 | 05:13 PM