High Court on Harish Rao Petition: హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:11 PM
హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హరీశ్ రావు పిటిషన్ వేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 23: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హరీశ్ రావు పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీశ్ రావుపై బాచుపల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. హరీశ్ రావుతో ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కేవలం రాజకీయ కక్ష్యల కారణంగానే పోలీసులు కేసు నమోదు చేశారని విచారణ సందర్భంగా హరీశ్ తరఫు న్యాయవాది వాదించారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టేసిందని న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
Kavitha: గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి: కవిత
TG Govt On Sub Registrars: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం