Gopinath Getty: పలు పోలీస్ స్టేషన్లలో విశాఖ డీఐజీ తనిఖీలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:30 PM
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్షన్ చేసామని చెప్పారు. ప్రాపర్టీ అఫెన్సస్ ఎక్కువగా ఉన్నాయని.. వాటిలో పురోగతి ఆశించిన మేర లేదని చెప్పారు.
అమరావతి, అక్టోబర్ 23: వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి తనిఖీలు చేశారు. పీఎస్ లలో కేసుల పురోగతి, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్షన్ చేసామని చెప్పారు. ప్రాపర్టీ అఫెన్సస్ ఎక్కువగా ఉన్నాయని.. వాటిలో పురోగతి ఆశించిన మేర లేదని చెప్పారు. పోక్సో చట్టాలపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మిగతా శాఖలతో కలిసి మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. సైబర్ క్రైం పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న ఆయన.. సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెడతామని చెప్పారు.
ఫేక్ ఐడీలతో ఇతరులకు ఇబ్బంది కలిగించే పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. గంజాయి రవాణాపై గట్టి నిఘా పెట్టామని.. వినియోగం పైనా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడి ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు, మెయిల్స్ నమ్మవద్దన్నారు. ఉత్తరాంధ్రలో మావోయిస్టు ప్రాబల్యం లేదని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన వారు మావోయిస్టు ఉద్యమంలో ఉంటే బేషరతుగా లొంగిపోవాలని ఇప్పటికే పిలుపునిచ్చామని వివరించారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసర నిధుల మంజూరుకు సీఎం ఆదేశం
Rajahmundry Hostel Girl: రాజమండ్రిలో హాస్టల్ బాలికపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్