Share News

Srinivas Goud: పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు: శ్రీనివాస్ గౌడ్

ABN , Publish Date - Oct 25 , 2025 | 07:30 AM

పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా తాను పార్టీ మారలేదని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి తనతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తెలియదన్నారు. నవీన్ యాదవ్‌కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని అన్నారు.

Srinivas Goud: పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు: శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా తాను పార్టీ మారలేదని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి తనతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తెలియదన్నారు. నవీన్ యాదవ్‌కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఫాల్త్ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. తాను ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో ఉన్నామని చెప్పారు. తన తండ్రి తెలంగాణ ఉద్యమకారుడని.. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని వచ్చానని చెప్పారు.


ఉద్యోగంలో ఉండి జైలుకి వెళ్ళానని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తన తమ్ముడిని 40 రోజులు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒకే పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినట్లు చెప్పారు. తన జీవితం మొత్తం కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పారు. గెలవడం చేతకాక క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వారిపై రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేస్తామన్నారు. ఏ బుక్ లేదన్న డీజీపీ.. ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు.


'కాంగ్రెస్ వాళ్ళను మాత్రమే డీజీపీ కాపాడుతారా? ఫోటో ఏదో ఒక సందర్భంలో దిగితే సపోర్టు చేసినట్లేనా? సెటిల్ మెంట్లు చేసిన వాళ్ళను, రేప్ కేసులో ఉన్న వాళ్ళను వెంట తిప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. మాగంటి సునీత గెలుస్తుందనే అసత్య ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ చేసినట్లు బీసీలకు ఎవరూ మేలు చేయలేదు. కాంగ్రెస్ అఫీషియల్ ఫేస్‌బుక్‌లో నాపై పోస్టు పెట్టారు మీకు సిగ్గు ఉందా? ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను.. జీవితాలతో ఆటలు ఆడవద్దు. మా కుటుంబ సభ్యులను వేధించినా మేము భయపడలేదు' అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది

Sleeper Buses in India: కదిలే శవపేటికలు..!

Updated Date - Oct 25 , 2025 | 07:54 AM